Pawan Kalyan: బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పవన్ కల్యాణ్ సెల్ఫీ... ఫొటో ఇదిగో!

Pawan Kalyan selfie with Vijayalakshmi Gadwal and others at Rashtrapathi Nialyam in Bollaram
  • శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి
  • బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస
  • వివిధ రంగాల వారితో సమావేశం
  • హాజరైన పవన్ కల్యాణ్, గద్వాల్ విజయలక్ష్మి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఈ క్రమంలో, వివిధ పార్టీలు, రంగాలకు చెందినవారితో అల్పాహార సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. 

ఈ కార్యక్రమానికి వచ్చిన హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పవన్ ను కలిశారు. ఆయనతో సెల్ఫీ దిగి ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను గద్వాల్ విజయలక్ష్మి ట్విట్టర్ లో పంచుకున్నారు. 

కాగా, హైదరాబాదులో రాష్ట్రపతి శీతాకాల విడిది నేటితో ముగిసింది. ఈ మధ్యాహ్నం హకీంపేట వైమానిక స్థావరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యారు.
Pawan Kalyan
Gadwal Vijayalakshmi
Selfie
Rashtrapathi Nilayam
Bollaram
Droupadi Murmu
Hyderabad

More Telugu News