South Central Railway: మరో 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. నేటి నుంచే రిజర్వేషన్
- కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు
- తిరుపతి, వికారాబాద్, కాకినాడ, కాచిగూడ, నర్సాపూర్, హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న రైళ్లు
- జనవరి 7 నుంచి 18 వరకు అందుబాటులోకి
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను వరుసపెట్టి ప్రకటిస్తోంది. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన అధికారులు తాజాగా మరో 16 రైళ్లను ప్రకటించారు. ఇవన్నీ తిరుపతి, వికారాబాద్, కాకినాడ టౌన్, కాచిగూడ, నర్సాపూర్, హైదరాబాద్, తిరుపతి నుంచి బయలుదేరుతాయి.
ఈ రైళ్లు జనవరి 7 నుంచి 18 వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. నేటి ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే బోల్డన్ని ప్రత్యేక రైళ్లు ప్రకటించినప్పటికీ రద్దీ ఇంకా విపరీతంగా ఉండడం, రిజర్వేషన్ల వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉండడంతో తాజాగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర వెళ్లే ప్రయాణికుల కోసం ఈ రైళ్లు ప్రకటించింది.