new year 2023: న్యూ ఇయర్ ను ముందుగా స్వాగతించేది ఎక్కడంటే..!

new year celebration first starts in oceania

  • భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు ఓసియానియాలో కొత్త ఏడాది మొదలవుతుంది
  • ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో ముందుగా కొత్త ఏడాది సంబరాలు
  • చివరగా అమెరికా దగ్గర్లోని నిర్మానుష్య దీవులు న్యూ ఇయర్ ను స్వాగతిస్తాయి
  • ప్రపంచవ్యాప్తంగా 25 గంటల పాటు ఏదో ఒక దేశంలో కొత్త ఏడాది సంబరాలు

ఇంకొన్ని గంటల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం.. 2022కు గుడ్ బై చెప్పి, 2023కు వెల్కం చెబుతాం. అయితే, మనకన్నా ముందే కొత్త సంవత్సరాన్ని స్వాగతించే దేశాల వివరాలు తెలుసా? అంతర్జాతీయంగా వివిధ టైమ్ జోన్ లు ఉండడంతో కొత్త ఏడాది కొన్ని దేశాల్లో మనకన్నా ముందే వచ్చేస్తుంది. మరోవైపు, మనం సంబరాలు చేసుకుంటుంటే కొన్ని దేశాల్లో ప్రజలు కొత్త సంవత్సరం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. కొత్త సంవత్సరానికి సంబంధించిన కొన్ని విశేషాలు మీకోసం..

న్యూ ఇయర్ వేడుకలు మొత్తంగా ప్రపంచమంతటా 25 గంటల పాటు జరుగుతాయి. 4 వేల సంవత్సరాల క్రితం ఇరాక్ లోని బేబీలాన్ ప్రాంతం ప్రపంచంలోనే మొదటగా కొత్త ఏడాదిని స్వాగతించేది. తర్వాత మార్పులు చోటుచేసుకుని ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కలిసే ప్రాంతం.. ఓసియానియాలో కొత్త ఏడాది వేడుకలు మిగతా దేశాలకంటే ముందు మొదలవుతాయి. ఓసియానియాలోని టోంగా, కిరిబతి, సమోవా తదితర దేశాలు ఉన్నాయి. 

భారత కాలమానం ప్రకారం, డిసెంబర్ 31 మధ్యాహ్నం 3:30 గంటలకే ఓసియానియాలోని ప్రజలు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతారు. కొద్దిగా అటూఇటూగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక ప్రపంచ దేశాల్లో కొత్త ఏడాదికి చివరగా వెల్కం చెప్పేది అమెరికా సమీపంలోని బేకర్, హౌలాండ్ ద్వీపాలు. జనావాసం లేని ఈ ద్వీపాల్లో మన టైమ్ ప్రకారం చెప్పాలంటే జనవరి 1 న సాయంత్రం 5:30 గంటలకు కొత్త ఏడాది వస్తుంది.

  • Loading...

More Telugu News