CM Jagan: గుంటూరు తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్

CM Jagan shocked to know Guntur stampede

  • గుంటూరు వికాస్ నగర్ లో చంద్రన్న కానుకల పంపిణీ
  • ప్రసంగం ముగించుకుని వెళ్లిపోయిన చంద్రబాబు
  • ఒక్కసారిగా తోసుకువచ్చిన స్థానికులు
  • తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతి
  • బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న సీఎం

గుంటూరు వికాస్ నగర్ లో చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకోవడం తెలిసిందే. చంద్రబాబు ప్రసంగం ముగించుకుని వెళ్లిపోయాక, కానుకల పంపిణీ షురూ కాగా, బారికేడ్లు విరిగిపడి తొక్కిసలాట జరిగింది. ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించడం కలచివేసిందని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. 

అటు, రాష్ట్ర ఆరోగ్యమంత్రి విడదల రజని గుంటూరు జీజీహెచ్ లో బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కూడా బాధితులను పరామర్శించారు.

  • Loading...

More Telugu News