shriram finance: డిపాజిట్లపై అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్న శ్రీరామ్ ఫైనాన్స్
- ఐదేళ్ల డిపాజిట్ పై 8.45 శాతం
- 60 ఏళ్లు దాటిన వారికి అర శాతం అధిక రేటు
- మహిళలు అయితే మరో 0.10 శాతం ఎక్కువ
శ్రీరామ్ ఫైనాన్స్ గురించి చాలా మందికి తెలుసు. ఇదొక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఆర్ బీఐ ఆమోదంతో పనిచేస్తుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ్ చిట్స్, శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్ ను పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. చాలా శాఖలు ఈ కంపెనీకి ఉన్నాయి. చిట్స్, పలు రకాల రుణాలు, బీమా ఉత్పత్తులను ఈ సంస్థ అందిస్తుంటుంది. అలాగే ప్రజల నుంచి డిపాజిట్ల స్వీకరణకు ఆర్ బీఐ నుంచి అనుమతి ఉన్న సంస్థ.
ఈ సంస్థ ఏడాది కాల డిపాజిట్ పై 7.30 శాతం, 18 నెలల డిపాజిట్ పై 7.50 శాతం, 24 నెలల డిపాజిట్ పై 7.75 శాతం, 30 నెలల డిపాజిట్ పై 8 శాతం, 42 నెలల డిపాజిట్ పై 8.20 శాతం, 48 నెలల డిపాజిట్ పై 8.25 శాతం, 60 నెలల డిపాజిట్ పై 8.45 శాతం ఆఫర్ చేస్తోంది. 60 ఏళ్లు దాటిన వారికి అర శాతం అదనపు రేటు లభిస్తుంది. మహిళలకు అదనంగా 0.10 శాతంను ఆఫర్ చేస్తోంది. డిపాజిట్ రెన్యువల్ పై 0.25 శాతం అధిక రేటును సంస్థ ఆఫర్ చేస్తోంది.