TSRTC: తెలంగాణలోని ఏపీ ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్!

TSRTC To Introduce Sleeper Bus Services

  • నేటి నుంచి 10 స్లీపర్ బస్సులు అందుబాటులోకి
  • నాలుగు పూర్తిస్థాయి స్లీపర్ బస్సులు కాగా, ఆరు స్లీపర్ కమ్ సీటర్ బస్సులు
  • నేటి సాయంత్రం ప్రారంభించనున్న ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్, ఎండీ సజ్జనార్
  • హైదరాబాద్ నుంచి విజయవాడ, కాకినాడ మధ్య పరుగులు

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌‌కు వెళ్లే ప్రయాణికులకు ఇది శుభవార్తే. టీఎస్ ఆర్టీసీ నేటి నుంచి 10 స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. వీటిలో నాలుగు పూర్తిస్థాయి స్లీపర్ బస్సులు కాగా, ఆరు స్లీపర్ కమ్ సీటర్ బస్సులు. ఇవి హైదరాబాద్ నుంచి కాకినాడ, విజయవాడ మధ్య పరుగులు పెట్టనున్నాయి. నేటి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ బస్ స్టాప్ వద్ద టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ వీటిని ప్రారంభిస్తారు. 

హైదరాబాద్ నుంచి కాకినాడ వైపు వెళ్లే బస్సులు ప్రతిరోజూ రాత్రి 7.45, 8.30 గంటలకు బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయి. తిరిగి కాకినాడలో రాత్రి 7.15, 7.45 గంటలకు బయలుదేరుతాయి. అలాగే, విజయవాడ వైపు వెళ్లే బస్సులు మియాపూర్ నుంచి ప్రతిరోజూ ఉదయం 9.30, 10.45, 11.45 గంటలకు, రాత్రి 9.30, 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి ఉదయం 10.15, 11.15, మధ్యాహ్నం 12.15 గంటలకు, అర్ధరాత్రి 12.00, 12.45 గంటలకు తిరిగి బయలుదేరుతాయి.

  • Loading...

More Telugu News