Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థుల ఫొటోలను మార్ఫింగ్ చేసి.. వారికే పంపిస్తున్న అబ్బాయిలు.. విద్యార్థినుల ఆందోళన

Engineering Girls Photos Morphing by Male Students in Ghatkesar

  • అవుషాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినులు
  • వాట్సాప్ గ్రూపులోని డీపీలను సేకరించి మార్ఫింగ్ చేసి వారికే పంపుతున్న కొందరు విద్యార్థులు
  • భయంగా ఉందంటూ ఆందోళనకు దిగిన విద్యార్థినులు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి మరో ఫోన్ నుంచి తిరిగి తమకు పంపుతున్నారంటూ ఇంజినీరింగ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్‌లో గత రాత్రి జరిగిందీ ఘటన. మండలంలోని అవుషాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు కొందరు వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు. 

అబ్బాయిల్లో కొందరు అమ్మాయిల డీపీల నుంచి ఫొటోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి వేరే ఫోన్ల నుంచి తమకు పంపుతున్నట్టు ఆరోపిస్తూ గత రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తొలుత ఈ విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకెళ్లిన అమ్మాయిలు.. భయంగా ఉందంటూ హాస్టల్ వద్ద నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే హాస్టల్‌కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News