OnePlus 11 5G: వన్ ప్లస్ 11 5జీ విడుదల.. ఫిబ్రవరి 7న భారత మార్కెట్ కు

OnePlus 11 5G launched with 100W fast charge and Snapdragon 8 Gen 2 SoC

  • చైనాలో ఆరంభ వేరియంట్ ధర రూ.48,000 
  • మొత్తం మూడు వేరియంట్లలో రానున్న ప్రీమియం ఫోన్ 
  • కెమెరా పరంగా మెరుగైన సెన్సార్లు

వన్ ప్లస్ 11 5జీ ఎడిషన్ చైనాలో విడుదలైంది. ఫిబ్రవరి 7న భారత్ లోనూ విడుదల కానుంది. 6.7 అంగుళాల క్యూహెచ్ డీ ప్లస్ ఈ4 ఓఎల్ఈడీ పంచ్ హోల్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్ సెట్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

వెనుక ప్యానెల్ భిన్నమైన డిజైన్ తో ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపీ 54 రేటింగ్, ఇన్ డిప్ ప్లే ఫింగర్ ప్రింట్, 100 వాట్ చార్జర్ తో రానుంది. ఈ ఫోన్ లో కెమెరాకు ప్రాధాన్యం ఇచ్చారు. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 48 మెగా పిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 581 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 32 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 709 2ఎక్స్ టెలీఫొటో కెమెరా, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. 

12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ప్రారంభ ధర 3,999 యువాన్లు. మన కరెన్సీలో రూ.48,000. 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర మన కరెన్సీ ప్రకారం రూ.53,000. 16 జీబీ ర్యామ్, 512 జీబీ ర్యామ్ ధర రూ.59,000. ఫిబ్రవరి 10న ఐకూ11 కూడా రానుంది. ఇందులో కొంచెం మెరుగైన ఫీచర్లు వున్నాయి. మన దేశంలో వన్ ప్లస్ కు గణనీయమైన కస్టమర్లు ఉండడం తెలిసిందే.

  • Loading...

More Telugu News