new years resolution: న్యూ ఇయర్ రిజల్యూషన్ అంటే ఇదేనా..!: ఆలోచింపజేసే ఆనంద్ మహీంద్రా ట్వీట్
- మొదలు పెట్టిన మూడు రోజులకే ముగింపు
- మాటల్లో కాదు ఆచరణ ముఖ్యమన్న సంకేతం
- 24 గంటల్లోనే 11 లక్షల మంది వీక్షణ
60 సెకండ్లు గడిస్తే నిమిషం. 60 నిమిషాలు గడిస్తే గంట. 24 గంటలు గడిస్తే రోజు. 365 రోజులు గడిస్తే ఏడాది. ఇలా కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. మార్పు కోసం, మంచి కోసం, సానుకూల ఫలితాలను సాధించేందుకు కొత్త ఏడాదే కానక్కర్లేదు. జనవరి 1 వరకు వేచి చూడక్కర్లేదు. కానీ, కొంత మంది కొత్త సంవత్సరం సందర్భంగా తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. పోనీ అనుకున్నవి ఆచరిస్తారా? అంటే సందేహమే.