Satya Nadella: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సమావేశం
- భారత్ లో పర్యటిస్తున్న సత్య నాదెళ్ల
- ప్రధాని మోదీతో పలు అంశాలపై చర్చ
- భారత్ డిజిటల్ ఇండియాను కొనియాడిన సత్య నాదెళ్ల
భారత్ లో నాలుగు రోజుల పర్యటనకు విచ్చేసిన మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని సాధించేందుకు భారత కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. వీరిద్దరి మధ్య భేటీలో డిజిటలైజేషన్ తో కూడిన సుస్థిర సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, తదితర అంశాలు చర్చకు వచ్చాయి.
ఈ భేటీపై సత్య నాదెళ్ల ట్విట్టర్ లో స్పందించారు. "ఎంతో ఆలోచనాత్మక ధోరణితో ఈ సమావేశం సాగింది... థాంక్యూ నరేంద్ర మోదీ. డిజిటలీకరణ మద్దతుతో నిలకడతో కూడిన ఆర్థికాభివృద్ధి సాధించేందుకు భారత కేంద్రప్రభుత్వం అత్యంత శ్రద్ధ చూపుతుండడం స్ఫూర్తిదాయకం. ప్రపంచానికి దారిచూపేలా భారత్ డిజిటల్ ఇండియా విజన్ ను సాకారం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ సాయపడుతుంది" అని ఆయన వివరించారు.