Hardik Pandya: అర్షదీప్ సింగ్ బౌలింగ్ తో బిత్తరపోయిన హార్థిక్ పాండ్యా
- మొదటి ఓవర్ లో మూడు నో బాల్స్
- మొత్తం రెండు ఓవర్లకు ఐదు నో బాల్స్
- భారీగా 37 పరుగుల సమర్పణ
- నో బాల్ కారణంగా అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న దాసున్ షణక
శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమి, స్వయంకృతాపరాధం అని చెప్పడం అతిశయోక్తి కానే కాదు. బౌలింగ్ విషయంలో మన వాళ్లు సత్తా చాటలేకపోయారు. ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీసినప్పటికీ ఒక్కో ఓవర్ కు 12 చొప్పున ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్ ఒక్కడు మెరుగైన బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీశాడు. ముఖ్యంగా శివమ్ మావి 4 ఓవర్లలో ఓవర్ కు 13కు పైనే పరుగులు ఇచ్చాడు. ఇక అర్షదీప్ గురించి అయితే చెప్పే పనేలేదు. రెండు ఓవర్లు బౌలింగ్ చేయగా.. శ్రీలంక బ్యాటర్లు 37 పరుగులు పిండుకున్నారు.
ఇన్నింగ్స్ ఆరంభంలో అర్షదీప్ సింగ్ బౌలింగ్ చేయగా, ఒక్క ఓవర్ కే భారీగా పరుగులు ఇవ్వడంతో కెప్టెన్ హార్థిక్ పాండ్యా భయపడిపోయాడు. ఇన్నింగ్స్ చివరికి వచ్చే వరకు అర్షదీప్ సింగ్ తో మళ్లీ బౌలింగ్ చేయించలేదు. 19వ ఓవర్ లో మరోసారి బౌలింగ్ అప్పగించాడు. అర్షదీప్ సింగ్ రెండు ఓవర్లలో మొత్తం ఐదు నో బాల్స్ వేశాడంటే అతడిలో ఆత్మ విశ్వాసం లోపించినట్టు తెలుస్తోంది. మొదటి ఓవర్ లోనే హ్యాట్రిక్ నోబాల్స్ వేశాడు.
అర్షదీప్ సింగ్ నో బాల్ కు భారీ మూల్యం కూడా చెల్లించాల్సి వచ్చింది. శ్రీలంక కెప్టెన్ దాసున్ షణక అవుట్ కాగా, నో బాల్ కావడంతో బతికిపోయాడు. ఈ సమయంలో హార్థిక్ పాండ్యా రెండు చేతుల్లో ముఖం వాల్చి బాధపడడం కనిపించింది.