Urvashi Rautela: పంత్ హాస్పిటల్ పిక్ షేర్ చేసిన ఊర్వశి.. మండిపడుతున్న ఫ్యాన్స్

Urvashi Rautela shares pic of Mumbai hospital where Rishabh is admitted
  • తాను ఆ సమయంలో అక్కడ ఉన్నానంటూ క్యాప్షన్
  • ఫొటోలు పెడితే ఏమొస్తుంది? వెళ్లి పరామర్శించు అంటూ ఓ అభిమాని సూచన
  • మతి స్థిమితం గానీ తప్పిందా ఊర్వశి? అంటూ మరో అభిమాని ప్రశ్న
వికెట్ కీపర్ రిషబ్ పంత్ తో ఆ మధ్య సామాజిక మాధ్యమంలో గొడవ పడిన ఊర్వశి రౌతేలా గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు పంత్ గురించి పరోక్షంగా ఊర్వశి పెట్టిన పోస్ట్ తో ఆమెపై విమర్శలు వచ్చి పడుతున్నాయి. పంత్ అభిమానులు ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. 

రిషబ్ పంత్ గత శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం తెలిసిందే. డెహ్రాడూన్ నుంచి అతడ్ని మెరుగైన చికిత్స కోసం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆసుపత్రికి బీసీసీఐ తరలించింది. పంత్ చికిత్స పొందుతున్న కోకిలాబెన్ ఆసుపత్రి ఫొటోను ఊర్వశి రౌతేలా తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. అంతకుముందు పంత్ కోసం ప్రార్థిస్తున్నానంటూ ఆమె వ్యంగ్యంగా పోస్ట్ చేయడం గమనార్హం. 

కోకిలాబెన్ ఆసుపత్రి ఫొటో పోస్ట్ చేయడంతో.. పంత్ ను ఊర్వశి పరామర్శించి ఉంటుందా? అని పరిశీలించిన అభిమానులకు ఆమె నిర్వాకం చూసి మంటకెత్తింది. తాను ఆ సమయంలో అక్కడ ఉన్నానంటూ క్యాప్షన్ పెట్టడం అభిమానులకు మరింత కోపాన్ని తెప్పించింది. దీంతో పంత్ అభిమానులు ఊర్వశి పై కామెంట్లతో, ట్రోలింగ్ తో విరుచుకు పడుతున్నారు. 

‘‘అరే భాయ్ ఊర్వశి మతిస్థిమితం కోల్పోయిందా ఏంటి? పంత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి ఫొటో పెట్టింది?’’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ‘‘ఆసుపత్రి బయటి నుంచి ఫొటోను పోస్ట్ చేయడం కాదు.. మనసుంటే వెళ్లి పంత్ ను పరామర్శించు’’ అని మరో యూజర్ సూచించాడు. క్రికెటర్ల మానసిక ప్రశాంతతతో ఆటలాడుకోవద్దంటూ మరో నెటిజన్ సూచన చేశాడు. ‘‘మేడమ్, మీరు పంత్ కోసం ప్రార్థించొచ్చు. కానీ, హాస్పిటల్ ఫొటోలు పోస్ట్ చేసి మీరు ఏం చేస్తున్నారు? పంత్ ప్రశాంతతను చెడగొడుతున్నారు’’ అని మరో యూజర్ అన్నాడు.
Urvashi Rautela
rishab panth
Mumbai hospital
trolling

More Telugu News