Prince Harry: ఆఫ్ఘనిస్థాన్ లో 25 మందిని హతమార్చిన బ్రిటన్ యువరాజు హ్యారీ... జీవితచరిత్రలో వెల్లడి

Prince Harry said he killed 25 Talibans in Afghanistan

  • ప్రిన్స్ హ్యారీ జీవితచరిత్ర స్పేర్ లో ఆసక్తికర అంశాలు
  • బ్రిటన్ దళాల తరఫున తాలిబన్లపై పోరాడిన హ్యారీ
  • అపాచీ పోరాట హెలికాప్టర్ పైలెట్ గా పనిచేసిన వైనం
  • యుద్ధరంగంలో తన పనితీరు సంతృప్తి కలిగించిందని వెల్లడి

బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ తన జీవితచరిత్రపై 'స్పేర్' పేరిట ఓ పుస్తకం తెస్తున్నాడు. ఈ ఆటోబయోగ్రఫీ జనవరి 10న విడుదల కానుంది. ఈ పుస్తకంలో ప్రిన్స్ హ్యారీకి సంబంధించి అనేక ఆసక్తికర సంగతులు ఉన్నాయి. 

ప్రిన్స్ హ్యారీ గతంలో బ్రిటన్ దళాల తరఫున ఆఫ్ఘనిస్థాన్ లో పోరాడారు. ఆ సమయంలో తాను 25 మంది తాలిబన్ అతివాదులను హతమార్చినట్టు తన పుస్తకంలో వెల్లడించారు. తాలిబన్లు మనుషులే కాదన్న విషయం తనకు బ్రిటన్ సైన్యం బోధించిందని తెలిపారు. అయితే, తాను రెండు డజన్ల మంది తాలిబన్లను చంపడం పట్ల గర్వించడం కానీ, విచారించడం కానీ చేయనని పేర్కొన్నారు.

ప్రిన్స్ హ్యారీ ఆఫ్ఘన్ క్షేత్రంలో అపాచీ అటాకింగ్ హెలికాప్టర్ పైలెట్ గా విధులు నిర్వర్తించారు. బ్రిటన్ రాయల్ ఆర్మీలో 2007-08 మధ్యకాలంలో హ్యారీ ఫార్వార్డ్ ఎయిర్ కంట్రోలర్ గా వ్యవహరించారు. 

యుద్ధరంగంలో తాను సాధించిన ఘనత 25 మందిని చంపడమేనని, పోరాటంలో పాల్గొన్నందుకు తనకు ఈ సంఖ్య ఎంతో సంతృప్తి కలిగించిందని హ్యారీ తన పుస్తకం 'స్పేర్' లో పేర్కొన్నారు. అంతేకాదు, ఒక్క గాయం కూడా కాకుండా ఆఫ్ఘన్ నుంచి బ్రిటన్ తిరిగొచ్చానని తెలిపారు.

కాగా, ప్రిన్స్ హ్యారీ తన భార్య మేఘన్ మోర్కెల్ కారణంగా బ్రిటన్ రాజకుటుంబంతో సంబంధాలు తెంచుకోవడం తెలిసిందే. భార్యపై ప్రేమ, వైవాహిక జీవితం కోసం ఆయన రాచరికపు బాధ్యతలను కూడా వదులుకున్నారు.

  • Loading...

More Telugu News