Dil Raju: 'వారసుడు' విషయంలో వెనక్కి తగ్గిన దిల్ రాజు?

Dil Raju thinking about postponing Varasudu movie
  • సంక్రాంతికి విడుదల కానున్న చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు
  • సంక్రాంతి బరిలో దిల్ రాజు 'వారసుడు' సినిమా కూడా
  • విడుదల వాయిదా వేయాలనుకుటున్న దిల్ రాజు
ఈ సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బాలయ్య చిత్రం 'వీర సింహారెడ్డి' ఈ నెల 12న విడుదల కాబోతోంది. చిరంజీవి సినిమా 'వాల్తేరు వీరయ్య' 13న రిలీజ్ అవుతోంది. ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం గమనార్హం. మరోవైపు, ఇదే సమయంలో తమిళ స్టార్ విజయ్ తో దిల్ రాజు నిర్మించిన 'వారసుడు' కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేశారు. అయితే ఆరోజు సినిమాను విడుదల చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. 

ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్న తరుణంలో తమిళ హీరోతో తీసిన సినిమాను విడుదల చేస్తున్నారంటూ ఇప్పటికే దిల్ రాజుపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'వారసుడు' సినిమాను వాయిదా వేయాలని దిల్ రాజు నిర్ణయించినట్టు సమాచారం. తమిళ వర్షన్ ను జనవరి 11నే విడుదల చేస్తున్నప్పటికీ... తెలుగు వర్షన్ విడుదల మాత్రం వాయిదా పడనున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
Dil Raju
Varasudu Movie
Release

More Telugu News