Vijay Deverakonda: అభిమానులకు విజయ దేవరకొండ నుంచి ఊహించని గిఫ్ట్

Vijay Deverakonda to send 100 fans to Manali on all expense paid holiday
  • మనాలీ ట్రిప్ కు 100 మంది అభిమానులు
  • ఐదు రోజుల పర్యటనలో పర్వతాలు, ఆలయాల సందర్శన
  • అభిమానులతో జాయిన్ కానున్న లైగర్ హీరో
లైగర్ హీరో విజయ్ దేవరకొండ తన అభిమానుల కోసం ఊహించని విధంగా న్యూ ఇయర్ గిఫ్ట్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు. మనాలీలో మంచు పర్వతాల అందాలను చూసేందుకు 100 మంది అభిమానులను పంపిస్తానని ప్రకటించాడు. ఇందుకు సంబంధించి ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ‘‘మీలో 100 మంది పర్వతాల వద్దకు వెళతారు. హ్యాపీ న్యూ ఇయర్. మీ కోసం బిగ్ కిసెస్, ఎంతో ప్రేమ అందిస్తున్నాను. ఇది దేవర శాంతా అప్ డేట్. మీలో 100 మందిని మనాలీ ట్రిప్ కోసం పంపిస్తున్నాననేది తెలుసు’’అంటూ అందులో అప్ డేట్ ఇచ్చాడు.

‘‘ఆహారం, ప్రయాణం, వసతి అంతా నేనే చూసుకుంటాను. మనాలీకి ఐదు రోజుల పర్యటన ఉంటుంది. మంచు దుప్పటేసిన పర్వతాలకు, ఆలయాలకు, మఠాలకు వెళతారు. ఎన్నో యాక్టివిటీలకు ప్లాన్ చేశాను. 18 ఏళ్లు నిండి, నన్ను అనుసరించే వారు గూగుల్ డాక్యుమెంట్ ను ఫిల్ చేయండి. మీలో 100 మందిని ఎంపిక చేసి మనాలీకి పంపిస్తాను. మీతో నేను కూడా జాయిన్ అవుతాను’’అని విజయ్ దేవరకొండ అభిమానులకు ఊహించని కానుకను ప్రకటించాడు. ప్రస్తుతం ఈ నటుడు ఖుషీ సినిమాతో బిజీగా ఉండడం తెలిసిందే. (విజయ్ దేవరకొండ మాట్లాడిన వీడియో కోసం క్లిక్ చేయండి)
Vijay Deverakonda
fans
100 members
manali
new year gift

More Telugu News