Shruthi Haasan: అనారోగ్యంతో 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోతున్నా: శృతి హాసన్

Shruthi Haasan says she can not attend Waltair Veerayya Pre Release Event
  • చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య
  • జనవరి 13న రిలీజ్
  • నేడు విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈవెంట్ ను మిస్ అవుతున్నానంటూ శృతి హాసన్ విచారం
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కలయికలో రూపొందిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్స్ లో జరగనుంది. ఇప్పటికే చిరంజీవి, రవితేజ విశాఖ చేరుకున్నారు. 

అయితే వాల్తేరు వీరయ్యలో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్టు వెల్లడించింది. అనారోగ్యం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని శృతి హాసన్ తెలిపింది. ఈవెంట్ ను చాలా మిస్ అవుతున్నానని విచారం వ్యక్తం చేసింది. శృతి హాసన్ అటు బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలోనూ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఒంగోలులో జరగ్గా, ఈ కార్యక్రమానికి శృతి హాజరైంది. 

కాగా, విశాఖలో ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మేనియా నెలకొంది. మెగా ఫ్యాన్స్ ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ కు భారీగా తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది.
Shruthi Haasan
Waltair Veerayya
Pre Release Event
Visakhapatnam

More Telugu News