Bihar: మహిళలు విద్యావంతులైనప్పుడే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందన్న నితీశ్ కుమార్.. బీజేపీ ఫైర్

BJP leaders lash out at Nitish over comment linking women to population control

  • ‘సమాధాన్ యాత్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న నితీశ్ కుమార్
  • మహిళలు నిరక్షరాస్యులు కావడం వల్ల జనాభా నియంత్రణను కట్టడి చేయలేకపోతున్నారని వ్యాఖ్య
  • రాష్ట్ర ప్రతిష్ఠను సీఎం దిగజార్చారని బీజేపీ మండిపాటు

మహిళలు విద్యావంతులైనప్పుడే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘సమాధాన్ యాత్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న నితీశ్ కుమార్.. వైశాలిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. మహిళలు విద్యావంతులైనప్పుడు గర్భం దాల్చకుండా ఏమేం చేయాలనే దానిపై వారికి అవగాహన ఉంటుందని అన్నారు. ఈ విషయంలో మగవారు నిర్లక్ష్యంగా ఉంటారని అన్నారు. మహిళలు నిరక్షరాస్యులు కావడం వల్ల అణచివేతకు గురవుతూ జనాభా నియంత్రణను కట్టడి చేయలేకపోతున్నారని నితీశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

నితీశ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బహిరంగ సభలో సీఎం ఇలా మాట్లాడడం ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠను, ముఖ్యమంత్రి పదవిని ఆయన దిగజార్చారని బీజేపీ శాసనసభా పక్ష నేత సామ్రాట్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News