Rohit Sharma: రోహిత్ ను చూసి ఏడ్చేసిన అభిమాని.. దగ్గరికెళ్లి ఓదార్చిన కెప్టెన్.. వీడియో ఇదిగో!

Rohit Sharma Comforts Crying Fan Who Struggled To Control Tears Upon Meeting him
  • బుగ్గ గిల్లుతూ, ఫొటోలు దిగుతూ చిన్నారిని ఓదార్చిన టీమ్ ఇండియా కెప్టెన్
  • అసోంలోని బర్సపారా స్టేడియంలో ప్రాక్టీస్ సందర్భంగా అభిమానులను పలకరించిన రోహిత్ శర్మ
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను చూసిన ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్నాడో చిన్నారి.. అభిమాని కన్నీటి పర్యంతమవడం రోహిత్ గమనించాడు. ఏడుస్తున్న అభిమాని దగ్గరికి వెళ్లి ఓదార్చాడు. శ్రీలంకతో నేడు జరగబోయే వన్డే మ్యాచ్ కోసం సోమవారం ప్రాక్టీస్ చేస్తుండగా చోటుచేసుకుందీ ఘటన. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది.

మంగళవారం నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్ మొదలవుతున్న సంగతి తెలిసిందే! తొలి వన్డే గువాహటిలో నేటి మధ్యాహ్నం జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం బర్సపార స్టేడియంలో టీమ్ ఇండియా ప్రాక్టీస్ చేసింది. క్రికెట్ ఆటగాళ్లను చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వచ్చారు.

ప్రాక్టీస్ సెషన్ ముగిశాక రోహిత్ శర్మ అభిమానులను పలకరించాడు. ఈ సందర్భంగా రోహిత్ ను చూసిన ఆనందంలో ఓ కుర్రాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ ఆ కుర్రాడి దగ్గరికి వెళ్లి ఓదార్చాడు. బుగ్గ గిల్లి, కలిసి ఫొటోలు దిగి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇదంతా అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి నెట్ లో పెట్టాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
Rohit Sharma
Cricket
odi
assam
cricketers practice
fan

More Telugu News