Kiran Abbavaram: 'వినరో భాగ్యము విష్ణుకథ' పార్టు 2 ఉంటుంది: బన్నీవాసు

Vinaro Bhagyamu Vishnu katha Movie Teaser Launch Event
  • గీతా ఆర్ట్స్ 2 నుంచి 'వినరో భాగ్యము విష్ణుకథ'
  • కిరణ్ అబ్బవరం జోడీ కట్టిన కశ్మీర
  • బ్యాంకాక్ లోను జరిగిన షూటింగు
  • అల్లు అరవింద్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్  
  • వచ్చేనెల 17న రిలీజ్ అవుతున్న సినిమా
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఓ మాదిరి బడ్జెట్ తో యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ వెళుతున్నారు. అలాగే కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ బ్యానర్ పై కిరణ్ అబ్బవరం హీరోగా 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా రూపొందింది. ఈ రోజున అల్లు అరవింద్ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. 

మీడియా మీట్ లో బన్నీవాసు మాట్లాడుతూ .. "ఈ సినిమా కోసం బ్యాంకాక్ వెళ్లడం జరిగింది. పార్టు 2కి అవసరమైన లీడ్ ఇవ్వడం కోసం అక్కడికి వెళ్లడం జరిగింది. డైరెక్టర్ గారు చెప్పిన ఒక ఐడియా నచ్చడం వలన, పార్టు 2 కి ఒక లీడ్ వేసి పెట్టాను. ఆ చిన్న లీడ్ కోసం యూనిట్ మొత్తాన్ని చాలా కష్టపెట్టాను కూడా" అన్నారు.

"బ్యాంకాక్ లో ఉదయం షూటింగు మొదలుపెట్టి సాయయంత్రానికి పూర్తిచేశాము. నాకు తెలిసి ఎవరూ కూడా సినీ చరిత్రలో బ్యాంకాక్ లో ఇలా షూటింగు చేసి ఉండరు" అంటూ నవ్వేశారు. కశ్మీర కథానాయికగా పరిచయమవుతున్న ఈ సినిమాను, ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నారు.
Kiran Abbavaram
kashmira
Aamani
Murali Sharma

More Telugu News