- శ్రీలంకపై సచిన్, కోహ్లీ చెరో 8 సెంచరీలు
- ఈ సిరీస్ లో కోహ్లీ మరో శతకం బాదేస్తే మొదటి స్థానం
- 50 ఓవర్ల ఫార్మాట్ లో సచిన్ కంటే కోహ్లీ ఒకే ఒక్క స్థానం తక్కువ
శ్రీలంకపై వన్డే సిరీస్ కు ఎంపికైన విరాట్ కోహ్లీ.. బ్యాట్ తో రాణిస్తే అతడి ఖాతాలో కొత్త రికార్డులు వచ్చి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. నేటి నుంచి శ్రీలంక-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం అవుతుండడం తెలిసిందే. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తాను ఎంతగానో ఆరాధించే సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును సైతం అధిగమించగలడు.
50 ఓవర్ల ఫార్మాట్ లో అంతర్జాతీయంగా అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు సచిన్ టెండుల్కర్ పేరిట ఉంది. 19 సెంచరీలతో విరాట్ కోహ్లీ కేవలం ఒకే ఒక్క అడుగు వెనుక ఉన్నాడు. ఈ సిరీస్ లో కోహ్లీ ఒక రెండు శతకాలు బాదితే, 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా సచిన్ ను దాటిపోతాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి 49 శతకాలతో, అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా సచిన్ మొదటి స్థానంలో ఉంటే, 44 సెంచరీలతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. అంటే మరో 6 సెంచరీలు చేస్తే కోహ్లీయే ప్రపంచ నంబర్ 1 శతకవీరుడిగా నిలుస్తాడు.
శ్రీలంకపై కోహ్లీ ఇప్పటికి 8 సెంచరీలు నమోదు చేశాడు. సచిన్ టెండుల్కర్ సైతం శ్రీలంకపై 8 సెంచరీలు చేసిన రికార్డుతో సమాన స్థానంలో ఉన్నాడు. మరి సచిన్ ను అధిగమించేందుకు కోహ్లీ ఈ సిరీస్ లో ఒక్క శతకం చేసినా చాలు. మొత్తం మీద శ్రీలంకతో సిరీస్ లో కోహ్లీ కనీసం రెండు సెంచరీలు నమోదు చేస్తే రెండు రికార్డులు అతడి ఖాతాలో పడడం ఖాయమే.