gold: బంగారంపై 16 శాతం రాబడి ఇస్తానంటున్న ఫింటెక్ యాప్ 'గుల్లక్'
- డిజిటల్ రూపంలో లీజుకు అవకాశం
- లీజుకు ఇచ్చే బంగారానికి హామీ
- 0.5 గ్రాముల నుంచి లీజుకు ఇచ్చే వెసులుబాటు
ఫైనాన్షియల్ సేవలు అందించే ఫింటెక్ యాప్ గుల్లక్ ‘గుల్లక్ గోల్డ్ ప్లస్’ అనే పథకాన్ని ప్రకటించింది. బంగారాన్ని ఆభరణాల వర్తకులకు ఇస్తే, ఏకంగా 16 శాతం రాబడి ఇస్తానని ఈ సంస్థ హామీ ఇస్తోంది. బంగారంలో పెట్టుబడులపై చారిత్రకంగా చూస్తే సగటున వార్షిక రాబడి 11 శాతంగా ఉంది. దీనికంటే 5 శాతం అధిక రాబడిని గుల్లక్ ఆఫర్ చేస్తోంది.