Sensex: ఫ్లాట్ గా ముగిసిన మన స్టాక్ మార్కెట్లు

markets ends in losses

  • పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు
  • ఉదయం నుంచి ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు
  • 9 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం నుంచి కూడా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగాయి. సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్న తరుణంలో మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 9 పాయింట్లు నష్టపోయి 60,105 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 17,895కి పడిపోయింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (1.65%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.58%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.37%), టీసీఎస్ (1.30%), టాటా మోటార్స్ (1.21%). 

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-3.46%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.89%), రిలయన్స్ (-1.27%), నెస్లే ఇండియా (-1.25%), టైటాన్ (-1.20%).

  • Loading...

More Telugu News