Gautam Gambhir: సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడు: గంభీర్

Kohli will hit more ODI centuries than Sachin says Gambhir

  • శ్రీలంకతో తొలి వన్డేలో 45వ సెంచరీ సాధించిన కోహ్లీ
  • తన వన్డే కెరీర్లో 49 సెంచరీలు చేసిన సచిన్
  • వన్డేల్లో సచిన్ కంటే కోహ్లీ ఎక్కువ సెంచరీలు చేస్తాడన్న గంభీర్

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ చెలరేగిన సంగతి తెలిసిందే. తన అద్భుతమైన ఆటతీరుతో కోహ్లీ మరో సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో కోహ్లీపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. వన్డే ఫార్మాట్ లో ఇప్పటికే తానేంటో కోహ్లీ నిరూపించుకున్నాడని... వన్డేల్లో సచిన్ కంటే ఎక్కువ సెంచరీలను కోహ్లీ చేస్తాడని అన్నాడు. వన్డేల్లో ఇప్పటి వరకు కోహ్లీ 45 సెంచరీలు చేశాడు. మరో 5 సెంచరీలు చేస్తే సచిన్ రికార్డును (49) అధిగమిస్తాడు. వన్డే రూల్స్ మారిన తరుణంలో సచిన్, కోహ్లీల తరాలను పోల్చలేమని గంభీర్ అన్నాడు. 

అప్పట్లో ఒక్క కొత్త బంతి మాత్రమే ఉండేదని.. ఇప్పుడు రెండు కొత్త బంతులతో పాటు 30 యార్డ్ సర్కిల్ లో ఐదుగురు ఫీల్డర్లు ఉంటున్నారని చెప్పారు. ఈ ఫార్మాట్లో కోహ్లీ మాస్టర్ అని... సచిన్ సెంచరీల రికార్డును బద్దలు చేయడం కోహ్లీకి సులువేనని అన్నాడు. మరోవైపు రోహిత్ శర్మపై కూడా గంభీర్ ప్రశంసలు కురిపించాడు. 83 పరుగులు చేసి ఔటైన రోహిత్ శర్మ భారీ స్కోరు సాధించేందుకు అవకాశం ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడని చెప్పారు. రోహిత్ అనుకుని ఉంటే ఈ మ్యాచ్ లో మరో డబుల్ సెంచరీ సాధించేవాడని అన్నాడు.

  • Loading...

More Telugu News