Dr.Pavuluri Krishna Choudary: ప్రఖ్యాత హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి కన్నుమూత

Doctor Pavuluri Krishna Choudary Passes Away

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇంటి వద్దే చికిత్స
  • కుమారుడు అమెరికా నుంచి వచ్చాక అంత్యక్రియలు
  • అభిమానుల సందర్శనార్థం అమీర్‌పేటలోని ఇంట్లో పార్థివదేహం

గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి కన్నుమూశారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. ఇంటి దగ్గరే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో గత రాత్రి 11.20 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య సుందర రాజేశ్వరి 2010లో మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా.. పెద్ద కుమారుడు 18 ఏళ్ల వయసులో మృతి చెందారు. 

రెండో కుమారుడు డాక్టర్ నరేంద్రనాథ్ అమెరికాలో వైద్యుడు. కుమార్తె హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఆమె కుమార్తె డాక్టర్ అపర్ణ కూడా హోమియో వైద్యంలో నిపుణురాలిగా పేరు తెచ్చుకున్నారు. డాక్టర్ పావులూరి పార్థివ దేహాన్ని నేడు అభిమానుల సందర్శనార్థం అమీర్‌పేటలోని ఆయన స్వగృహంలో ఉంచుతారు. కుమారుడు నరేంద్రనాథ్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News