Shruti Haasan: నా మానసిక ఆరోగ్యం బాగానే ఉంది: శ్రుతిహాసన్

Shruti Haasan slams reports of missing Waltair Veerayya event due to mental problems says had viral fever
  • ఆరోగ్యం పట్ల ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటానన్న శ్రుతి 
  • వైరల్ ఫీవర్ వల్లే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేదని వెల్లడి
  • ఆ అభిప్రాయం నుంచి బయటకు రండంటూ సూచన
 తనకు మానసిక ఆరోగ్యం బాగోలేదంటూ వస్తున్న వార్తలపై ప్రముఖ నటి, కమలహాసన్ కుమార్తె శ్రుతిహాసన్ సీరియస్ గా స్పందించింది. చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో ఆమె నటించింది. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ కార్యక్రమం ఈ నెల 8న విశాఖపట్నంలో జరిగింది. తనకు అనారోగ్యంగా ఉండడంతో హాజరు కాలేకపోతున్నానంటూ ఆమె ముందే తెలియజేసింది. అనారోగ్యం అని చెప్పి ముఖ్యమైన కార్యక్రమానికి రాకపోవడంతో పలు పుకార్లకు అవకాశం లభించింది. 

దీంతో మానసిక అనారోగ్యం వల్లే కార్యక్రమానికి డుమ్మా కొట్టిందంటూ పుకార్లు వచ్చాయి. ఈ దుష్ప్రచారంపై శ్రుతిహాసన్ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఘాటుగా స్పందించింది. తనకు వైరల్ ఫీవర్ ఉండడం వల్లే వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేదని ఆమె స్పష్టం చేసింది. తాను ఎప్పుడూ మానసికంగా ఆరోగ్యంగానే ఉంటానని స్పష్టం చేసింది. తాను ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటానని పేర్కొంది. ‘‘మీరు ఈ అభిప్రాయం నుంచి బయటకు రండి. లేదంటే థెరపిస్ట్ ను సంప్రదించండి’’ అని తన పట్ల తెలిసీ, తెలియకుండా మాట్లాడే వారికి గట్టి బదులు ఇచ్చింది.
Shruti Haasan
missing
Waltair Veerayya
event
viral fever

More Telugu News