Raghu Rama Krishna Raju: నా మిత్రుడు చిరంజీవికి, నా కజిన్ రవితేజకు శుభాకాంక్షలు: రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju congratulates Chiranjeevi and Raviteja
  • నేడు వాల్తేరు వీరయ్య రిలీజ్
  • సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ రఘురామ ట్వీట్
  • ఈ రాత్రికి సినిమా చూస్తానని వెల్లడి
  • వాల్తేరు వీరయ్య చిత్రబృందానికి శుభాకాంక్షలు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టయినర్ మూవీలో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటించడం విశేషం. 

ఈ నేపథ్యంలో, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ అయిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. వాల్తేరు వీరయ్య చిత్రాన్ని ఈ రాత్రికి వీక్షిస్తానని రఘురామ వెల్లడించారు. నా ఫ్రెండ్ చిరంజీవికి, నా కజిన్ రవితేజకు, చిత్ర దర్శకుడు బాబీకి, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు, యావత్ చిత్రబృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.
Raghu Rama Krishna Raju
Chiranjeevi
Raviteja
Waltair Veerayya
Bobby
Tollywood

More Telugu News