Jallikattu: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో జల్లికట్టు ప్రారంభం

Jallikattu starts in Anuppalle village in Tirupati district
  • సంక్రాంతి సందర్భంగా పలు ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహణ
  • చంద్రగిరి నియోజకవర్గం అనుప్పల్లెలో జల్లికట్టు కోలాహలం
  • భారీగా తరలివచ్చిన ప్రజలు
  • ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్న యువత
సంక్రాంతి సందర్భంగా తమిళనాడులోనూ, తమిళనాడు-ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారు. జల్లికట్టులో భాగంగా బలమైన ఎద్దులను బరిలోకి వదిలి వాటి కొమ్ములకు కట్టిన జెండాలను చేజిక్కించుకునేందుకు యువత పోటీలు పడుతుంటారు. 

నేడు భోగి పండుగను పురస్కరించుకుని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం అనుప్పల్లెలో జల్లికట్టు పోటీలు ప్రారంభం అయ్యాయి. జల్లికట్టును చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దాంతో అనుప్పల్లె గ్రామం ఇసుకేస్తే రాలనంతగా క్రిక్కిరిసిపోయింది. కాగా, ఈ పోటీల్లో ముగ్గురికి గాయాలైనట్టు తెలుస్తోంది.
Jallikattu
Anuppalle
Chandragiri
Tirupati District
Sankranti
Andhra Pradesh

More Telugu News