Telangana: సంక్రాంతి వేడుకలో పొంగలి వండి వడ్డించిన గవర్నర్ తమిళిసై

governer tamilisai celebrates sankranti at rajbhavan
  • రాజ్ భవన్ లో సందడిగా సంక్రాంతి వేడుకలు 
  • సిబ్బంది, అధికారులతో కలిసి పాల్గొన్న గవర్నర్
  • అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన తమిళిసై
తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్ భవన్ లో ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. సిబ్బంది, అధికారులతో కలిసి సౌందరరాజన్ పాల్గొన్నారు. స్వయంగా పొంగలి వండి అందరికీ వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ బిల్లులేవీ తన వద్ద పెండింగ్ లో లేవని, పరిశీలనలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. వాటి విషయాల్లో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. ఉద్యోగ నియామకాలు న్యాయపర చిక్కులతో ఆలస్యం కాకూడదని ఆమె అన్నారు.

ఇక, మలక్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చిన ఇద్దరు మహిళలు మృతి చెందడం  బాధాకరం అని గవర్నర్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిని సందర్శించాలని అనుకున్నా... పండగ కారణంగా వెళ్లలేకపోయానని చెప్పారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగు పడాల్సిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
Telangana
Governor
Tamilisai Soundararajan
Sankranti

More Telugu News