Teachers: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Telangana govt gives nod to Teachers transfers and promotions

  • సంక్రాంతి వేళ టీచర్లకు శుభవార్త
  • ఉపాధ్యాయ సంఘాలతో సబితా, హరీశ్ రావు భేటీ
  • బదిలీలు, పదోన్నతులపై చర్చ
  • రెండు మూడ్రోజుల్లో షెడ్యూల్ విడుదల

ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా తియ్యని కబురు చెప్పింది. టీచర్ల బదిలీలు, పదోన్నతులకు పచ్చజెండా ఊపింది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్థికమంత్రి హరీశ్ రావు నేడు ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై చర్చించారు. ఇరువర్గాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. సీఎం కేసీఆర్ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో... బదిలీలు, పదోన్నతులపై రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానుంది. 

తెలంగాణలో 1.5 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండగా, వారిలో 10 వేల మంది పదోన్నతుల కోసం వేచి ఉన్నారు. తెలంగాణలో 2015లో టీచర్లకు పదోన్నతులు కల్పించారు. ఆ తర్వాత టీచర్లకు మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత పదోన్నతులు కల్పిస్తున్నారు. 

మరో 50 వేల మంది బదిలీల కోసం వేచిచూస్తున్నారు.  2018 తర్వాత టీచర్ల బదిలీలు చేపట్టనుండడం ఇదే ప్రథమం. సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వెల్లివిరుస్తోంది.

  • Loading...

More Telugu News