Balamurugan: ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూత

Popular Tamil Telugu story writer Balamurugan Passed Away

  • తెలుగు, తమిళ సినిమాలకు రచయితగా పనిచేసిన బాలమురుగన్
  • ఆయన కుమారుడే ప్రముఖ రచయిత భూపతి రాజా
  • గీతా ఆర్ట్స్ తొలి సినిమాకు కథ అందించింది ఆయనే

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా పనిచేసిన ఆయన నిన్న ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు, రచయిత భూపతి రాజా తెలిపారు.

బాలమురుగన్ తెలుగులో ధర్మదాత, సోగ్గాడు, ఆలుమగలు, సావాసగాళ్లు, జీవన తరంగాలు వంటి హిట్ సినిమాలకు కథ అందించారు. గీతా ఆర్ట్స్ తొలిసారి నిర్మించిన ‘బంట్రోతు భార్య’ సినిమాకు కూడా ఆయనే కథ అందించారు. తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేశన్‌కు దాదాపు 40 కథల వరకు అందించారు. బాలమురుగన్ మృతి వార్త తెలిసిన తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

  • Loading...

More Telugu News