Tollywood: పవన్‌ కల్యాణ్ సినిమాలో అవకాశం వచ్చినా చేయను: ప్రియాంక జవాల్కర్

I will not do Pawan Kalyans film evel if I get a chance says Priyanka Jawalkar

  • పవన్ కు అభిమానిగానే ఉండిపోతానన్న ప్రియాంక
  • ట్యాక్సీవాలాతో మెప్పించిన జవాల్కర్
  • తర్వాత చిన్న చిత్రాలతో నెట్టుకొస్తున్న తెలుగు నటి

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో అవకాశం రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తే స్టార్ డమ్ అమాంతం పెరిగిపోతుందని హీరోయిన్లు ఆశిస్తున్నారు. ఆ చాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. కానీ, పవన్ సరసన చాన్స్ వచ్చినా తాను చేయనని అంటోంది తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. ఈ అనంతపురం అమ్మాయి విజయ్ దేరకొండ సరసన ‘ట్యాక్సీవాలా’లో నటించి మెప్పించింది. కానీ, తర్వాత ఆశించిన అవకాశాలు రాకపోవడంతో చిన్న సినిమాలో చేసుకుంటూ బండి నెట్టుకొస్తోంది. 

అయితే, ఏకంగా పవన్ సినిమాలో చాన్స్ వచ్చినా చేయను అనడానికి బలమైన కారణమే ఉందని ప్రియాంక చెబుతోంది. తనకు పవన్ కల్యాణ్ అంటే పిచ్చి అని, ఆయన నటించిన తమ్ముడు సినిమాను 20 సార్లు చూశానని ఆమె చెప్పింది. ఖుషీ సినిమాలో ప్రతీ డైలాగ్ కూడా తనకు గుర్తుందంటోంది. పవన్ కు తాను అభిమానినని, ఆయనని దూరం నుంచి చూస్తూ, అభిమానిస్తూ ఉండిపోవాలని అనుకుంటున్నట్టు తెలిపింది. అంతకు మించి ఏమీ కోరుకోవడం లేదని, ఒకవేళ ఆయన సినిమాలో అవకాశం వచ్చినా చేయనని చెప్పింది. అంత పెద్ద స్టార్‌ అయినా కూడా పవన్ అంత సింపుల్‌గా ఎలా ఉంటారో తనకు అర్థం కాదని చెప్పింది.

  • Loading...

More Telugu News