Peddireddi Ramachandra Reddy: మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు తప్పిన ప్రమాదం

Peddi Reddy and Mithun Reddy escaped from accident
  • పుంగనూరు నుంచి వీరబల్లికి వెళ్తుండగా ప్రమాదం
  • కాన్వాయ్ లోని వాహనాన్ని ఢీకొన్న ఎదురుగా వస్తున్న వాహనం
  • మిథున్ వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బందికి గాయాలు
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పండుగ సందర్భంగా బంధువుల ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే వాహనంలో వెళ్తున్నప్పుడు వారి కాన్వాయ్ లోని వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

పుంగనూరు నుంచి వీరబల్లిలోని అత్తగారి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ప్రమాదం జరిగింది. మిథున్ రెడ్డికి చెందిన కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మిథున్ కారు పల్టీలు కొట్టింది. అయితే ఆ సమయంలో తండ్రి పెద్దిరెడ్డి కారులో మిథున్ ఉండటంతో వీరికి ప్రమాదం తప్పింది. అయితే మిథున్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బందికి మాత్రం గాయాలయ్యాయి. గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Peddireddi Ramachandra Reddy
Mithun Reddy
Accident

More Telugu News