cigarette butt: రోడ్డుపై సిగరెట్ పీక పడేసినందుకు రూ.55 వేల జరిమానా విధించిన ఇంగ్లాండ్ కోర్టు!

British Man Fined Over rs 55000 For Throwing Cigarette Butt On Road

  • ఇంగ్లాండ్ లోని థోర్న్ బరీ టౌన్ లో ఘటన
  • తొలుత రూ.15 వేలు ఫైన్ వేసిన అధికారులు
  • జరిమానా కట్టకపోవడంతో కోర్టుకు చేరిన కేసు
  • ఫైన్ మొత్తాన్ని రూ.55 వేలకు పెంచిన న్యాయమూర్తి

రోడ్డు మీద సిగరెట్ పీక పడేసిన బ్రిటీష్ పౌరుడికి ఇంగ్లాండ్ లోని ఓ కోర్టు ఏకంగా రూ.55 వేలు (558 పౌండ్లు) జరిమానా విధించింది. సిగరెట్ తాగి పీకను ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల రోడ్లపై చెత్త తయారవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించింది. ఇంగ్లాండ్ లోని థోర్న్ బరీ టౌన్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

టౌన్ లో అలెక్స్ డేవిస్ అనే వ్యక్తి సిగరెట్ తాగి, పీకను రోడ్డుపై పడేశాడు. స్ట్రీట్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇది చూసి అలెక్స్ కు రూ.15 వేలు (150 పౌండ్లు) జరిమానా విధించారు. ఆ మొత్తం వెంటనే కట్టాలని ఆదేశించారు. అయితే, అలెక్స్ ఈ ఆదేశాలను లెక్కచేయకుండా వెళ్లిపోయాడు. దీంతో అలెక్స్ ను అధికారులు కోర్టుకీడ్చారు. రోడ్లపై చెత్త పడేశాడని, జరిమానా చెల్లించేందుకు ఇష్టపడలేదని ఆరోపించారు. కేసు విచారించిన న్యాయమూర్తి.. అలెక్స్ కు రూ.55 వేలు జరిమానా విధించారు.

  • Loading...

More Telugu News