Islamist militants: బుర్కినాఫాసోలో 50 మంది మహిళలను ఎత్తుకుపోయిన ఉగ్రవాదులు
- అడవిలో పండ్లు ఏరుకునేందుకు వెళ్లిన మహిళలు
- వారిని ఎత్తుకుపోయిన ఉగ్రవాదులు
- విడిపించేందుకు అధికారుల చర్యలు
ఆహారం కోసం అడవిలో అన్వేషణలో ఉన్న 50 మంది మహిళలను ఇస్లామిక్ ఉగ్రవాదులు అపహరించుకుపోయారు. బుర్కినాఫాసోలోని ఉత్తర ప్రావిన్స్ సోమ్ లో ఈ ఘటన జరిగింది. ఈ తరహా పెద్ద ఎత్తున మహిళల అపహరణ అక్కడ ఇదే మొదటిది. ఈ తరహా మహిళల అపహరణ ఘటనలు నైజీరియాలో తరచుగా బోకో హరామ్ వర్గం చేస్తుంటుంది.
లికీ అనే గ్రామం సమీపంలో అడవిలో పండ్లు ఏరుకునే క్రమంలో వున్న మహిళలను ఉగ్రవాదులు ఎత్తుకుపోయారు. వారిని గుర్తించి, విడిపించేందుకు అక్కడి అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. తమ కుటుంబ సభ్యుల ఆకలి తీర్చుకునేందుకు మరో మార్గం లేక మహిళలు పండ్లు, గింజలను ఏరుకునేందుకు అడవికి వెళ్లినట్టు బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పశ్చిమాఫ్రికా దేశమైన బిర్కినాఫాసో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల తిరుగుబాటుతో అంశాంతిని ఎదుర్కొంటోంది.