Yuva Galam: లోకేశ్ ను కలిసి పాదయాత్రకు మద్దతు తెలిపిన టీడీపీ నేతలు

tdp leaders met with nara lokesh and extended support to yuvagalam yatra
  • ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ నేతలతో లోకేశ్ భేటీ
  • ఈ నెల 27న కుప్పం నుంచి ప్రారంభం కానున్న ‘యువగళం’ యాత్ర
  • పాదయాత్ర వివరాలపై నేతలతో చర్చించిన టీడీపీ జాతీయ కార్యదర్శి
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన పాదయాత్రకు పార్టీలో అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు లోకేశ్ యాత్రకు మద్దతు పలుకుతున్నారు. ఉండవల్లిలోని లోకేశ్ నివాసానికి వచ్చి యాత్ర ఏర్పాట్లను అడిగి తెలుసుకుంటున్నారు. యాత్రకు మద్దతు తెలిపేందుకు వస్తున్న నేతలతో ఆయన సమావేశమవుతూ, ఏర్పాట్లపై వారితో చర్చిస్తున్నారు. యాత్రకు మద్దతు తెలిపిన నేతలకు ధన్యవాదాలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉండవల్లిలోని లోకేశ్ నివాసానికి మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చిన రాజప్ప, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తదితర నేతలు చేరుకున్నారు. లోకేశ్ ను కలిసి యువగళం యాత్రకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారితో సమావేశమైన లోకేశ్.. ఈ నెల 27న కుప్పం నుంచి ప్రారంభించనున్న యువగళం యాత్ర ఏర్పాట్లపై వారితో చర్చించారు. పార్టీ కార్యకర్తలు, నేతల మద్దతుతో.. ప్రజల్లో చైతన్యం తెచ్చేలా యువగళం పాదయాత్ర నిర్వహిస్తానని లోకేశ్ వారికి తెలిపారు.
Yuva Galam
tdp
Nara Lokesh
padayatra
kuppam
china rajappa
Kollu Ravindra
Payyavula Keshav

More Telugu News