Air India: ఎయిరిండియా పీ గేట్: విమానంలో ఆ నెంబర్ సీటే లేదంటున్న నిందితుడి లాయర్

Disagree with Air Indias 4month ban Man who urinated on woman flyer

  • నాలుగు నెలల నిషేధాన్నిఅంగీకరించని నిందితుడు శంకర్ మిశ్రా
  • విమానంలో తోటి ప్రయాణికురాలపై మూత్రవిసర్జన చేసిన శంకర్
  • గతేడాది నవంబర్ లో న్యూయార్క్-న్యూఢిల్లీ విమానంలో ఘటన

గత ఏడాది నవంబర్‌లో న్యూయార్క్-న్యూఢిల్లీ విమానంలో వృద్ధ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా నాలుగు నెలల నిషేధాన్ని విధించింది. నిషేధం అమల్లో ఉన్నంత కాలం శంకర్ విమానాల్లో ప్రయాణం చేయలేడు. తనపై ఎయిరిండియా విధించిన బ్యాన్ ను శంకర్ మిశ్రా అంగీకరించడం లేదు. దీన్ని సవాల్ చేస్తానంటున్నాడు. 

ఈ క్రమంలో అతని తరఫు న్యాయవాది అక్షత్ బాజ్‌పాయ్ తన క్లయింట్‌ను నాలుగు నెలల పాటు నిషేధించాలనే కమిటీ నిర్ణయంతో తాను విభేదిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే అప్పీల్ దాఖలు చేసే పనిలో ఉన్నారని ఆయన తెలిపారు. కమిటీ రిపోర్టుపై ఆయన మెలిక పెట్టారు. అంతర్గత విచారణ కమిటీ తీర్పు విమానం లేఅవుట్‌పై వారి తప్పు అవగాహనపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు.

బిజినెస్ క్లాస్‌లో నిందితుడు కూర్చున్నట్టుగా చెబుతున్న సీటు 9బి ఉందని కమిటీ తప్పుగా భావించిందన్నాడు. అసలు ఆ విమానం బిజినెస్ క్లాస్‌లో 9బి సీటు లేదన్నారు. కేవలం 9ఎ, 9సి సీట్లు మాత్రమే ఉన్నాయన్నారు. సీటు 9సిలోని ప్రయాణికుడిని ఏమాత్రం ప్రభావితం చేయకుండా 9ఏ సీటులో కూర్చున్న ఫిర్యాదుదారుపై నిందితుడు ఎలా మూత్ర విసర్జన చేశాడనే దానిపై కమిటీ తగిన వివరణ ఇవ్వలేకపోయిందన్నారు. బిజినెస్ క్లాస్‌లో 9బి లేకపోయినా ఉందని భావించి, నిందితుడు ఆ సీటు వద్ద నిలబడి 9ఏ సీటులో కూర్చుకున్న ఫిర్యాదుదారుపై మూత్ర విసర్జన చేసి ఉంటాడని ఊహించారని చెప్పారు. కానీ, బిజినెస్ క్లాస్‌లో 9బి సీటే లేదని, కేవలం 9ఎ, సి సీట్లు మాత్రమే ఉన్నాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

  • Loading...

More Telugu News