Woman: ప్రపంచ వృద్ధురాలి ఆరోగ్య రహస్యాలు

Woman becomes worlds oldest living person at 115 shares secrets of her long life

  • స్పెయిన్ వాసి మారియా బ్రన్యాస్ మొరెరాకు 115 ఏళ్లు
  • గుర్తించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
  • క్రమబద్ధమైన జీవనం, ఆందోళన లేకపోవడం, ప్రశాంతతలే కారణమట   

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇటీవలే ఇన్ స్టా గ్రామ్ లో ప్రపంచంలోనే అత్యధిక వయసున్న వృద్ధురాలి గురించిన వివరాలు ప్రకటించింది. ఈమె పేరు మారియా బ్రన్యాస్ మొరెరా. 1907 మార్చి 4న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించిన ఈమె ప్రస్తుతం స్పెయిన్ లో నివసిస్తోంది. ప్రపంచంలో జీవించి ఉన్న అత్యధిక వయసున్న మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది. 118 ఏళ్ల లూసిలే రాండన్ (ఫ్రాన్స్) మరణించడంతో, ప్రపంచ వృద్ధురాలిగా బ్రన్యాస్ మొరెరాను గుర్తించింది.

115 ఏళ్లపాటు జీవించి ఉండడం అంటే సాధారణ విషయమేమీ కాదు. అందుకు జన్యుపరంగా, జీవన పరంగా ప్రత్యేకతలు కచ్చితంగా ఉండి ఉంటాయి. 22 ఏళ్లుగా ఆమె ఒకే నర్సింగ్ హోమ్ లో జీవిస్తున్నట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తెలిపింది. అంతకాలం పాటు జీవించి ఉండడానికి దోహదపడిన అంశాలను కూడా తెలియజేసింది.

‘‘క్రమబద్ధమైన జీవనం, ప్రశాంతత, కుటుంబం, స్నేహితులతో మంచి సంబంధాలు, ప్రకృతితో మమేకం కావడం, భావోద్వేగాల పరంగా స్థిరత్వం, దేని గురించి ఆందోళన, భయం చెందకపోవడం, విచారించకపోవడం, ఎంతో సానుకూల దృక్పథం, హానికారక వ్యక్తులకు దూరంగా ఉండడం. దీనికితోడు అదృష్టం, మంచి జన్యువులు’’ అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ స్వయంగా తెలిపింది.

  • Loading...

More Telugu News