Nagababu: పొత్తులపై నాగబాబు కీలక వ్యాఖ్యలు
- కర్నూలులో జనసైనికులతో నాగబాబు సమావేశం
- దుర్మార్గం, దౌర్జన్యం, అరాచకం కలిస్తే వైసీపీ అని విమర్శ
- పొత్తులు కుదిరిన తర్వాతే ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయిస్తామని వ్యాఖ్య
వైసీపీ కూడా ఒక పార్టీయేనా అని జనసేన నేత నాగబాబు విమర్శించారు. దుర్మార్గం, దౌర్జన్యం, అరాచకం కలిస్తే వైసీపీ అని అన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు పక్కా అనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై నాగబాబు స్పందిస్తూ... పొత్తులు ఎవరితో ఉంటాయనే విషయాన్ని తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని చెప్పారు.
పొత్తులు కుదిరిన తర్వాతే ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పొత్తుల విషయంలో ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తున్నామనే విషయాన్ని పవన్ ప్రకటిస్తారని చెప్పారు. పొత్తులు కుదరక ముందే పోటీ చేయబోయే స్థానాలపై మాడ్లాడటం అనవసరమని అన్నారు. జనసైనికులు, వీర మహిళల నుంచి సమస్యలను తెలుసుకోవడానికే తాను కర్నూలుకు వచ్చానని తెలిపారు. కర్నూలులో జనసేన నేతలు, కార్యకర్తలతో నాగబాబు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.