Wipro: మీ శిక్షణకు రూ.75 వేలు ఖర్చయింది.. తిరిగివ్వండి!: తొలగించిన ఫ్రెషర్స్ కు విప్రో కంపెనీ నోటీసులు

Wipro fires 400 freshers due to poor performance

  • ఆ మొత్తాన్ని మాఫీ చేస్తున్నట్లు తర్వాత లేఖలు పంపిన కంపెనీ
  • పనితీరు బాగాలేదంటూ 452 మంది ఫ్రెషర్లను తొలగించిన విప్రో
  • కంపెనీ ప్రమాణాలకు సరిపోరంటూ ఆరోపించిన టెక్ దిగ్గజం

ఖర్చులు తగ్గించుకునే పేరుతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్న జాబితాలోకి టెక్ దిగ్గజం ‘విప్రో’ కూడా చేరింది. అయితే, మిగతా కంపెనీలతో పోలిస్తే విప్రో ఒకడుగు ముందుకేసి ఉద్యోగుల నుంచి సొమ్ము కూడా వసూలు చేసుకునే ప్రయత్నం చేసింది. ఉద్యోగంలోకి తీసుకున్నాక శిక్షణ కోసం వారిపై వెచ్చించిన సొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ఆ సొమ్మును మాఫీ చేస్తున్నట్లు సదరు ఉద్యోగులకు లేఖలు పంపింది.

విప్రోలో ఇటీవల చేరిన 452 మంది ఫ్రెషర్లకు ఆ కంపెనీ షాక్ ఇచ్చింది. కంపెనీ అంతర్గత మదింపులో వారి పనితీరు బాగాలేదని తేలిందని చెబుతూ, వాళ్లను ఉద్యోగంలో నుంచి తీసేసింది. అంతేకాదు, శిక్షణ కోసం వారిపై కంపెనీ రూ.75 వేలు వెచ్చించిందని, ఆ మొత్తాన్ని కంపెనీకి కట్టేయాలని నోటీసులు కూడా పంపింది. ఓవైపు ఉద్యోగం ఊడిందన్న ఆవేదనలో ఉన్న వారికి ఈ నోటీసులు ఆందోళనలోకి నెట్టాయి. అయితే, ఈ మొత్తాన్ని మాఫీ చేస్తున్నట్లు విప్రో తాజాగా లేఖలు పంపడంతో కొంత ఉపశమనం దక్కింది.

  • Loading...

More Telugu News