Anantha Sriram: టాలీవుడ్ గీత రచయిత అనంత శ్రీరామ్ పై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు

Bhatraju caste reps complains against Tollywood lyricist Anantha Sriram
  • పాలకొల్లులో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న అనంత శ్రీరామ్
  • భట్రాజు పొగడ్తలు అంటూ పలికిన వైనం
  • ఈ పదబంధాన్ని నిషేధించిన ఏపీ ప్రభుత్వం
  • అనంత శ్రీరామ్ పై మండిపడుతున్న భట్రాజు కుల సంఘాలు
  • ఇప్పటికే క్షమాపణ చెప్పిన అనంత శ్రీరామ్
ఏపీ ప్రభుత్వం భట్రాజు పొగడ్తలు అనే పదబంధాన్ని నిషేధిత జాబితాలో ఉంచింది. అయితే, టాలీవుడ్ గీత రచయిత అనంత శ్రీరామ్ ఇటీవల సంక్రాంతి సంబరాల్లో భట్రాజు పదప్రయోగం చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన దీనిపై బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు. అయినప్పటికీ, అనంతశ్రీరామ్ పై భట్రాజు కులసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

తాజాగా, అనంత శ్రీరామ్ పై భట్రాజు కుల సంఘాల ప్రతినిధులు అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా అనంత శ్రీరామ్ పాలకొల్లులో సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ కార్యక్రమంలో భట్రాజు పొగడ్తలు అన్న పదాన్ని ఉపయోగించారు. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన పదాన్ని వాడి తమ వర్గీయులను అనంత శ్రీరామ్ కించపరిచాడంటూ భట్రాజు కులసంఘాలు మండిపడుతున్నాయి. అనంత శ్రీరామ్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాయి.
Anantha Sriram
Lyric Writer
Bhatraju
Police
Anantapur District
Tollywood

More Telugu News