Rishab Shetty: కాంతార 2 అప్ డేట్.. జూన్ నుంచి షూటింగ్!

Rishab Shetty writing script for kantara prequel film shoot in June
  • సీక్వెల్ కాదు ప్రీక్వెల్ గా తీస్తున్నామన్న నిర్మాత విజయ్ కిర్గందూర్
  • సినిమాపై రిషబ్ శెట్టి పని చేస్తున్నారని వ్యాఖ్య
  • 2024 ఏప్రిల్ లేదా మే నెలలో దేశవ్యాప్తంగా విడుదల చేస్తామని వెల్లడి
చిన్న సినిమాగా మొదలై.. పాన్ ఇండియా మూవీగా మారి రికార్డులు సృష్టించింది కాంతార. ముందు కన్నడలో హిట్ టాక్ అందుకుని.. తర్వాత పలు భాషల్లో రిలీజై కోట్లు కొల్లగొట్టింది. సినిమా లవర్స్ లో ఇంకా ఆ ఫీవర్ తగ్గనేలేదు.. అప్పుడే కాంతార 2 కోసం పనులు మొదలయ్యాయట. డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అయిపోయారట. ఈ విషయాన్ని ‘హంబాలే ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కిర్గందూర్ వెల్లడించారు. ‘డెడ్ లైన్’ న్యూస్ సంస్థతో మాట్లాడిన ఆయన పలు విషయాలను బయటపెట్టారు.

కాంతార 2 సీక్వెల్ కాదని.. ప్రీక్వెల్ అని కొత్త విషయం చెప్పారు. అలానే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. సినిమా షూటింగ్ కు వానాకాలం ముఖ్యమని, అందుకే జూన్ లో షూటింగ్ మొదలుపెడుతామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని విజయ్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం కర్ణాటకలోని కోస్టల్ రీజియన్ లో రిషబ్ శెట్టి పర్యటిస్తున్నారని, రెండు నెలలపాటు అక్కడే తిరుగుతూ అక్కడి సంప్రదాయాలపై మరింత సమాచారం తెలుసుకుంటారని వివరించారు. రెండో భాగానికి బడ్జెట్ పెంచామని, కానీ సినిమా స్టయిల్  అంతా తొలి భాగం మాదిరే ఉంటుందని వెల్లడించారు. నటీనటులను ఇంకా ఎంపిక చేయాల్సి ఉందని విజయ్ తెలిపారు.
Rishab Shetty
kantara prequel
Vijay Kirgandur
Hombale Films

More Telugu News