AP ERC: ముగిసిన ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ... 14 డిమాండ్లతో ప్రతిపాదనలను సమర్పించిన టీడీపీ
- రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు
- మూడ్రోజులుగా ఏపీ ఈఆర్సీ బహిరంగ విచారణ
- టీడీపీ తరఫున హాజరైన గురజాల మాల్యాద్రి
ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనల నేపథ్యంలో ఏపీ ఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టింది. మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ విచారణ నేటితో ముగిసింది. ఈ విచారణకు టీడీపీ తరఫున పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి హాజరయ్యారు. టీడీపీ తరఫున 14 డిమాండ్లతో కూడిన ప్రతిపాదనలను ఏపీ ఈఆర్సీకి సమర్పించారు.
2. కనీస శ్లాబు 50 యూనిట్లకు పెట్టాలి. 300 యూనిట్ల లోపు వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి.
3. కరోనా సమయంలో విద్యుత్ కోతల కారణంగా చిన్న పరిశ్రమలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఎమ్.డి ఛార్జీలు తిరిగి ఇవ్వాలి.
4. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును ఎక్కడ నివాసమున్నా వర్తింపజేయాలి. ఎస్సీ కాలనీలో నివాసానికే పరిమితం చేయడం అంటరానితనాన్ని ప్రోత్సహించినట్లు అవుతుంది.
5. వృత్తిదారులకు ఇస్తున్న రాయితీలకు ఇప్పటి విద్యుత్ బిల్లులు వర్తింపజేయరాదు.
6. ఆక్వా కల్చర్ కు జోన్, నాన్ జోన్ తో సంబంధం లేకుండా, ఎకరాలతో పరిమితి విధించకుండా రైతులందరికి యూనిట్ రూ.1.50లకు సరఫరా చేయాలి.
7. రూ.31 వేల కోట్ల ప్రభుత్వ బకాయిలు వసూలు చేయాలి.
8. ఏపీ జెన్ కో బహిరంగ మార్కెట్ లో ఏపీ ఈఆర్సీ సీలింగ్ రేటుకు మించి విద్యుత్ కొనరాదు.
9. థర్మల్ ప్లాంట్ కు బ్యాక్ డౌన్ చేయరాదు. సీజీఎస్ లకు పర్చేజ్ ఆర్డర్ మంజూరు చేయాలి.
10. ఆదివాసీ గ్రామసభల అనుమతి లేకుండా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ మంజూరు చేయరాదు.
11. ట్రాన్స్ ఫార్మర్లు మరియు విద్యుత్ పరికరాలు కొనుగోళ్లపై విచారణకు ఆదేశించాలి. ప్రైవేటీకరించరాదు.
12. ప్రభుత్వ ఒత్తిడికి లోనై టెండర్ల అంచనాలు భారీగా పెంచరాదు.
13. శ్రీ దామోదరం సంజీవయ్య సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం) పెండింగ్ లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కొత్త కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలి.
14. వినియోగదారులపై రూ.21 వేల కోట్ల అదనపు భారం పడే సెకి ఒప్పందం రద్దు చేసుకోవాలి.