media jobs: మీడియా సంస్థల్లోనూ ఉద్యోగాల్లో కోతలు

US Media Sees Massive Job Cuts Amid Falling Newsroom Employment

  • కష్టకాలంలో చిన్నా పెద్దా మీడియా కంపెనీలు
  • ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన వాక్స్ మీడియా
  • సీఎన్ఎన్, ఎన్ బీసీ, ఎంఎస్ఎన్ బీసీ, బజ్ ఫీడ్ లోనూ తొలగింపుల వార్తలు

ప్రముఖ కంపెనీలు, టెక్ దిగ్గజ సంస్థలు, మల్టీ నేషనల్ కంపెనీలలో మొదలైన ఉద్యోగాల కోతలు ఇప్పుడు మీడియా సంస్థలకూ పాకాయి. పేరొందిన మీడియా సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు మొదలయ్యాయి. అమెరికాకు చెందిన వాక్స్ మీడియా తన ఉద్యోగులలో సుమారు 7శాతం మందిని ఇంటికి పంపించనున్నట్లు వెల్లడించింది. ఈమేరకు శుక్రవారం ఉద్యోగులకు మెమో జారీ చేసింది.

సంస్థలోని అన్ని విభాగాలలో ఉన్న ఉద్యోగులలో కొంతమందిని తొలగించాలని నిర్ణయించినట్లు కంపెనీ సీఈవో జిమ్ బ్యాంకాఫ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థలకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోందని జిమ్ చెప్పారు. నష్టాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. వాక్స్ మీడియా గ్రూప్ లో ప్రస్తుతం 1900 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, అందులో 130 మందిని రాబోయే 15 నెలల్లో తొలగిస్తామని జిమ్ వివరించారు.

ఎన్ బీసీ, ఎంఎస్ఎన్ బీసీ సంస్థలు కూడా 75 మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొన్నాయి. వాషింగ్టన్ పోస్ట్ లో పనిచేస్తున్న 2,500 మంది ఉద్యోగులలో కొందరిపై వేటు పడనుందని ఆ సంస్థ సీఈవో ఫ్రెడ్ రాయన్ చెప్పారు. వైస్ మీడియాను అమ్మకానికి పెట్టినట్లు సీఈవో నాన్సీ తమ ఉద్యోగులకు వెల్లడించారు. ఇటీవలి కాలంలో సీఎన్ఎన్ తన ఉద్యోగులలో వందలాది మందిని ఇంటికి పంపించింది.

అమెరికాలోని వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సంఖ్య వేగంగా తగ్గిపోతోందని న్యూస్ రూమ్ ఎంప్లాయ్ మెంట్ సంస్థ ఓ రిపోర్టు వెల్లడించింది. 2008 లో 1,14,000 లుగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల సంఖ్య 2020 నాటికి 85 వేలకు పడిపోయిందని వివరించింది.

  • Loading...

More Telugu News