Narayan Patel: రోడ్లు బాగుండడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్న బీజేపీ ఎమ్మెల్యే

BJP MLA Narayan Patel says good roads caused to road accidents
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే
  • రోడ్లు బాగుంటే వాహనాలు వేగంగా వెళతాయని వెల్లడి
  • దాంతో వాహనాలు అదుపుతప్పే అవకాశముందని వివరణ
మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే నారాయణ పటేల్ రోడ్డు ప్రమాదాలకు కొత్త కారణం చెప్పారు. రోడ్లు బాగుండడం వల్లే మధ్యప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. 

రోడ్లు సాఫీగా ఉంటే, వాహనాలు అధికవేగంతో వెళుతుంటాయని, దాంతో అదుపుతప్పి ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నారాయణ పటేల్ విశ్లేషించారు. తన నియోజకవర్గంలో ఈ సమస్య తనకు కూడా ఎదురైందని తెలిపారు. దాంతో మీడియా ప్రతినిధులు స్పందిస్తూ, రోడ్లు అధ్వానంగా ఉంటే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతుందా? అని ఆయనను ప్రశ్నించారు. 

అందుకు ఆ ఎమ్మెల్యే బదులిస్తూ, కొందరు డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు. నారాయణ పటేల్ ఖాండ్వా జిల్లాలోని మంథనా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Narayan Patel
Road Accident
Roads
BJP
Madhya Pradesh

More Telugu News