Tamil Nadu: కుక్కను.. కుక్క అన్నందుకు వృద్ధుడిని చంపేశారు!

65 year old farmer calls neighbours pet dog a dog gets killed

  • తమిళనాడులోని తాడికొంబులో ఘటన
  • పెంపుడు కుక్కల విషయంలో బంధువుల మధ్య తరచూ గొడవలు
  • 19న జరిగిన గొడవలో 65 ఏళ్ల రాయప్పన్ మృతి

పెంపుడు కుక్కల విషయంలో బంధువుల మధ్య మొదలైన గొడవ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. కుక్కలను పేర్లతో కాకుండా ‘కుక్క’ అని అంటుండటం, వాటిని కొట్టేందుకు రావడంతో జరిగిన పరస్పర దాడుల్లో ఓ వృద్ధుడు చనిపోయాడు. తమిళనాడులో చోటుచోసుకుందీ ఘటన. 

దిండిగల్ జిల్లాలోని తాడికొంబులో 65 ఏళ్ల రాయప్పన్ ఉంటున్నాడు. పొరుగింట్లో డేనియల్, విన్సెంట్ ఉంటున్నారు. వీళ్లు బంధువులే. కానీ డేనియల్, విన్సెంట్ పెంచుకుంటున్న కుక్కల విషయంలో రాయప్పన్ తో తరచూ గొడవలు జరుగుతున్నాయి. అటువైపు వెళ్లే వారిపై కుక్కలు దాడి చేస్తున్నాయని రాయప్పన్ పలుమార్లు ఫిర్యాదు చేశాడు.

అయితే వాటిని కుక్కలు అనొద్దని, పేర్లు ఉన్నాయని, ఆ పేర్లతో పిలవాలని డేనియల్, విన్సెంట్ చాలా సార్లు చెప్పారు. కానీ రాయప్పన్ పట్టించుకోలేదు. కుక్కలను కట్టేసి ఉంచాలని సూచించాడు. దీంతో గత గురువారం నాడు మాటామాటా పెరిగి గొడవ పెద్దదైంది.. కుక్కలను కొట్టేందుకు రాయప్పన్ కర్ర తీసుకువచ్చాడు. దీంతో కోపోద్రిక్తులైన విన్సెంట్, డేనియల్.. రాయప్పన్ పై దాడి చేశారు.

దెబ్బలకు తాళలేక రాయప్పన్ స్పృహ తప్పిపడిపోయాడు. కొద్ది సేపటికే చనిపోయాడు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. తాడికొంబు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News