DA: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త... కరవుభత్యం పెంపు
- కరవుభత్యం పెంచిన సర్కారు
- 2.73 శాతం డీఏ/డీఆర్ పెంపు
- 20.02 శాతానికి పెరిగిన కరవుభత్యం
- 2021 జులై 1 నుంచి వర్తింపజేస్తామన్న హరీశ్ రావు
తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరవుభత్యం (డీఏ/డీఆర్) 2.73 శాతం పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా కరవుభత్యం 17.29 శాతం ఉండగా, తాజా పెంపుతో 20.02 శాతానికి చేరింది.
దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కరవుభత్యం పెంపుతో 4.40 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.88 లక్షల మంది పింఛనుదారులు లబ్దిపొందనున్నారని వెల్లడించారు. పెంచిన కరవుభత్యం 2021 జులై 1 నుంచి వర్తింపజేస్తామని తెలిపారు.