SAP: ఇప్పుడు SAP వంతు.. వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న సాఫ్ట్ వేర్ దిగ్గజం
- 3 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఎస్ఏపీ ప్రకటన
- కోర్ బిజినెస్ ను బలోపేతం చేయడానికే ఈ నిర్ణయమన్న ఎస్ఏపీ
- ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 1.2 లక్షలు
భారీ లేఆఫ్ లతో ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ సహా ఎన్నో టెక్ దిగ్గజాలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఆర్థికమాంద్యం ముంచుకొస్తున్న తరుణంలో కఠిన నిర్ణయాలను అమలు చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో జర్మన్ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఎస్ఏపీ (SAP) కూడా చేరింది. ఈ ఏడాది 3 వేల వరకు ఉద్యోగులను తొలగించనున్నామని ఈ రోజు ఆ సంస్థ ప్రకటించింది. కోర్ బిజినెస్ ఏరియాను బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఎస్ఏపీ తీసుకున్న ఈ నిర్ణయంతో కంపెనీలో పనిచేస్తున్న 2.5 శాతం ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఎస్ఏపీలో ప్రపంచ వ్యాప్తంగా 1,20,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.