stock markets: స్టాక్ మార్కెట్లో ఆగని అమ్మకాలు.. అదానీ గ్రూపు స్టాక్స్ విలవిల
- అదానీ గ్రూప్ లో అవకతవకలంటూ అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలు
- ఖండించిన అదానీ గ్రూప్
- ప్రతికూలంగా మారిన సెంటిమెంట్
- బడ్జెట్ ముందు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
అదానీ గ్రూపు షేర్లు శుక్రవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ కు వచ్చిన అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు ఇంట్రాడేలో సుమారు 10 శాతం నష్టాలను ఎదుర్కొంది. 3050.90 కనిష్ఠ ధరను బీఎస్ఈ లో నమోదు చేసింది. ప్రస్తుతం రూ.3,100 వద్ద ట్రేడవుతోంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ లో ఒక్కో షేరును రూ.3,112-3,276 ధరలో ఆఫర్ చేస్తుండగా, మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధరకే షేర్ లభిస్తోంది.