BVS Ravi: డైరెక్టర్ గా నేను ఫ్లాప్ కావడానికి అదే కారణం: రైటర్ బీవీఎస్ రవి
- రైటర్ గా అనేక సినిమాలకి పనిచేసిన రవి
- డైరెక్టర్ గా రెండు సినిమాల అనుభవం
- 'వాంటెడ్' మూవీ అందుకే ఫ్లాప్ అయిందని వెల్లడి
- 'జవాన్' ఫ్లాప్ లో అనేక కారణాలని వ్యాఖ్య
టాలీవుడ్ సీనియర్ సినిమా రైటర్స్ లో బీవీఎస్ రవి ఒకరు. కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణల విషయంలో ఆయనకి మంచి పట్టు ఉంది. ఆ మధ్య దర్శకుడిగా కూడా ఆయన ట్రై చేశాడు. 'వాంటెడ్' .. 'జవాన్' సినిమాలు ఆయన దర్శకత్వంలో రూపొందినవే. గోపీచంద్ హీరోగా ఆయన డైరెక్ట్ చేసిన ఫస్టు మూవీ 'వాంటెడ్' ఫ్లాప్ అయింది.
ఆ సినిమాను గురించి బీవీఎస్ రవి మాట్లాడుతూ .. "నాకు పని తెలియదని ఫస్టు సినిమా తరువాత తెలుసుకున్నాను. ఆ సినిమాకి చాలా గొప్పగా స్క్రిప్ట్ రాశాను. తెరపైకి వచ్చేసరికి చాలా మామూలు స్క్రిప్ట్ లా అనిపించింది. అంటే నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఆ స్థాయిలో కన్విన్స్ చేయలేకపోయాను .. ఆ సినిమా ఫ్లాప్ కి అదే కారణమని అనుకుంటున్నాను " అన్నాడు.
ఇటు నిర్మాత .. అటు హీరో .. ఇద్దరూ కూడా వీడికి ఏమీ తెలియదు అనిపించేలా అవసరమైన సరంజామాతో బిహేవ్ చేసినట్టుగా నాకు అనిపించింది. ఇక 'జవాన్' సినిమా విషయానికొస్తే, ఫైనల్ కాపీ చూసిన తరువాత దిల్ రాజుగారు జోక్యం చేసుకోవడం .. ఈ కథకి 'ధ్రువ' కథతో దగ్గర పోలికలు ఉండటం కూడా రిజల్టుపై ప్రభావము చూపించాయి" అని చెప్పాడు.