Moghal Gardens: రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్స్ కు పేరు మార్పు

New name for Moghal Gardens in Rashtrapathi Bhavan

  • ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మొఘల్ గార్డెన్స్ కు కొత్త పేరు
  • అమృత్ ఉద్యాన్ గా మార్చిన కేంద్రం
  • ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
  • ప్రజల సందర్శనకు జనవరి 31 నుంచి అనుమతి

రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్స్ అందాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధికెక్కాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం మొఘల్ గార్డెన్స్ పేరు మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రఖ్యాత ఉద్యానవనం పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చింది. 

75 వసంతాల స్వతంత్ర భారతావనిని దృష్టిలో ఉంచుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యాచరణను చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం... అందుకు అనుగుణంగానే మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్ గా మార్చినట్టు తెలుస్తోంది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదం తెలిపారు. 

ఇకపై సరికొత్త నామధేయంతో కొనసాగనున్న ఈ ఉద్యానవనాన్ని ద్రౌపది ముర్ము రేపు ప్రారంభించనున్నారు. కాగా, ప్రజల సందర్శన నిమిత్తం ఈ అమృత్ ఉద్యాన్ ను జనవరి 31 నుంచి మార్చి 26 వరకు తెరిచి ఉంచుతారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ఉద్యానవనం పూర్తిగా వికసించిన రంగురంగుల పువ్వులతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

  • Loading...

More Telugu News